పదవీ బాధ్యతలు స్వీకరించిన జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మహిళా నేతలు

|

Feb 22, 2021 | 12:25 PM

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా..

పదవీ బాధ్యతలు స్వీకరించిన జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మహిళా నేతలు
Follow us on

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌ల‌క్ష్మికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇటీవల జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి, తార్నాక కార్పొరేటర్‌గా మోతె శ్రీలత భారీ విజయం సాధించారు. తమకు ఈ పదవులు రావడానికి కారణమైన తమ డివిజన్‌ల అభివృద్ధికి తమవంతుగా కృషిచేస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని చెప్పారు. నగరంలో ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు. కార్పొరేటర్లతో కలుపుకుని పని చేస్తామన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కే విధంగా కృషి చేస్తామని మేయర్‌, డిప్యూటీ మేయర్‌ చెప్పారు.

Read more:

వరవరరావుకు ఎట్టకేలకు బెయిలు మంజూరు.. గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపిన విప్లవ కవి