AP BJP: బీజేపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై.. రాజీనామా లేఖలో ఏమన్నారంటే..

|

May 16, 2022 | 2:39 PM

పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీలో కొనసాగలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా, రావెల కిషోర్ బాబు కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..

AP BJP: బీజేపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై.. రాజీనామా లేఖలో ఏమన్నారంటే..
Former Minister Ravela Kish
Follow us on

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు(Ravela Kishore Babu) బీజేపీకి(BJP) గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ రాశారు. పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీలో కొనసాగలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా, రావెల కిషోర్ బాబు కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే రావెల కిషోర్ బాబు మళ్లీ టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. ఆయన ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడులో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు మరికొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి. తర్వాత 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది  రోజులకే రావెల జనసేనను వీడి.. బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న కొత్తలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. అయితే ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోయారు.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం మొదలు పెట్టరు. ఈ క్రమంలోనే ఆయన సొంతగూటికి అంటే.. తెలుగు దేశం పార్టీకి వెళ్తారు అంటూ ప్రచారం మొదలైంది.

ఇక రావెల కిశోర్ బాబు రాజకీయాల్లోకి రాకముందు ఐఆర్‌టీఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  చంద్రబాబు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని  పార్టీ నాయకత్వం భావించింది. దీంతో మంత్రివర్గం నుంచి రావెల కిషోర్ బాబును చంద్రబాబు తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన రావెల కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు.

రాజకీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప