టీవీ9 బిగ్ న్యూస్-బిగ్ డిబేట్‌లో గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ బాధితుల్లో ఒకరిని ఉప ఎన్నిక బరిలో నిలబెడతానని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్న నాన్-కాంట్రోవర్షియల్ వ్యక్తిని సెలక్ట్ చేసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెడతామన్నారు. ప్రజా మద్దతులో గెలిచి కొత్త చరిత్రకు శ్రీకారం చుడదాం అని ఆయన పిలుపునిచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరతానని చెప్పారు.
‘టీడీపీలోనే ఉంటా.. టీడీపీతోనే ఉంటా’ అంటూ కీలక కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గంటా. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో కలవాలని గంటా కోరారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్దమన్నారు. అందరూ కలిసి ఉద్యమం చేస్తే.. కేంద్రం వెనక్కి తగ్గుతుందని చెప్పారు. విశాఖతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. రాజీనామా తన వ్యక్తిగత నిర్ణయమన్నారు గంటా. మిగతావారు రాజీనామాలు చేస్తారో, లేదో వారి వ్యక్తిగత విషయమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఒక పరిశ్రమగా చూడొద్దని.. అది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని చెప్పారు.
Also Read:
MLA Jogi Ramesh: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పార్టీ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చన్న హైకోర్టు.. కానీ