ఎన్నికల ప్రచారంలో సీఎంపైకి చెప్పులు

చెన్నై: ఎన్నికల నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరిన ఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. తంజావూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరాడు. అయితే ఈ దాడి ఘటనలో సీఎంకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చెప్పులు విసిరిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో జనాలు ఎక్కువగా ఉండటం, […]

ఎన్నికల ప్రచారంలో సీఎంపైకి చెప్పులు

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:23 PM

చెన్నై: ఎన్నికల నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరిన ఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. తంజావూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరాడు. అయితే ఈ దాడి ఘటనలో సీఎంకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

చెప్పులు విసిరిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో జనాలు ఎక్కువగా ఉండటం, సీసీ కెమేరాలు కూడా లేకపోవడంతో దుండగుడు చెప్పుదాడికి ధైర్యం చేశాడు. భద్రతా పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగబోతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us