ఎన్నికలు వాయిదా వేయండి.. నిజామాబాద్‌లో రైతుల ఆందోళన

ఎన్నికలు వాయిదా వేయాలంటూ నిజామాబాద్‌లో రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంకా గుర్తులు కేటాయించలేదని ఆగ్రహం చేసిన కొంతమంది రైతులు.. ఎన్నికలు 15 రోజులు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన అవగాహన సదస్సు సాయంత్రానికి వాయిదాపడింది. కాగా తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌ సభ స్థానానికి గానూ రికార్డు స్థాయిలో 185మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై […]

ఎన్నికలు వాయిదా వేయండి.. నిజామాబాద్‌లో రైతుల ఆందోళన

Edited By:

Updated on: Apr 03, 2019 | 4:17 PM

ఎన్నికలు వాయిదా వేయాలంటూ నిజామాబాద్‌లో రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంకా గుర్తులు కేటాయించలేదని ఆగ్రహం చేసిన కొంతమంది రైతులు.. ఎన్నికలు 15 రోజులు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన అవగాహన సదస్సు సాయంత్రానికి వాయిదాపడింది.

కాగా తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌ సభ స్థానానికి గానూ రికార్డు స్థాయిలో 185మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా వారు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నికల గడువు సమీపించినా.. వారిలో కొంతమందికి గుర్తులు కేటాయించలేదు. దీంతో ఎన్నికల అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్ అవగాహన కేంద్రం ముందు బైఠాయించారు రైతులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించారు.