ఏపీ వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన పోలింగ్

| Edited By:

Apr 12, 2019 | 10:23 AM

గొడవలు జరిగినా.. ఈవీఎంలు మొరాయించినా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ పరవళ్లు తొక్కింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజీ చాలా చోట్ల అనూహ్యంగా పెరిగింది. సగటున 76.69శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 2014లో పోలింగ్ శాతం 74.5. ఇప్పుడు 72 శాతం ఓట్లు పోలయ్యాయి. విజయనగరంలో గత ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ 78.97 ఇప్పుడది 85 శాతానికి పెరిగింది. విశాఖ జిల్లాలో 2014లో పోలింగ్ 71.28శాతం. ప్రస్తుతం 70 శాతం పోలయింది. తూర్పుగోదావరి జిల్లాలో […]

ఏపీ వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన పోలింగ్
Follow us on

గొడవలు జరిగినా.. ఈవీఎంలు మొరాయించినా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ పరవళ్లు తొక్కింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజీ చాలా చోట్ల అనూహ్యంగా పెరిగింది. సగటున 76.69శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో 2014లో పోలింగ్ శాతం 74.5. ఇప్పుడు 72 శాతం ఓట్లు పోలయ్యాయి. విజయనగరంలో గత ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ 78.97 ఇప్పుడది 85 శాతానికి పెరిగింది. విశాఖ జిల్లాలో 2014లో పోలింగ్ 71.28శాతం. ప్రస్తుతం 70 శాతం పోలయింది. తూర్పుగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో 78.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు 81 శాతం పోలయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో 2014లో పోలింగ్ పర్సంటేజీ 82.5. ఇప్పుడు 81 శాతం ఓటింగ్ జరిగింది. కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో 79.7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు 79 శాతం పోలింగ్ జరిగింది. ఇక గుంటూరులో గత ఎన్నికల్లో పోలింగ్ శాతం 81.54. ఇప్పుడు 80 శాతం పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 83.25 శాతం పోలింగ్ జరిగింది. ఇప్పుడు పోలింగ్ పర్సంటేజీ 85 శాతానికి పెరిగింది.

నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 74.05 శాతం. ఇప్పుడు 75 శాతం పోలింగ్ జరిగింది. కడపలో గత ఎన్నికల్లో పోలింగ్ శాతం 76.51. ఇప్పుడు కేవలం 70 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే కడపలో 6 శాతంకి పైగా ఓటింగ్ తగ్గింది. ఇక కర్నూలులో 2014 ఎన్నికల్లో 73.56 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి కూడా 73 శాతం పోలింగ్ రికార్డు అయింది.

అనంతపురం జిల్లాలో 2014 ఎన్నికల్లో పోలింగ్ శాతం 74.28 శాతం. ఈసారి అనంతలో 79 శాతం పోలింగ్ రికార్డు అయింది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 5 శాతం ఓటింగ్ పెరిగింది. ఇక చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో 78.04 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి 79 శాతం పోలింగ్ రికార్డు అయింది.