AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఈసీ హెచ్చరిక

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. హద్దులు దాటుతున్నారు. ఇలా హద్దు దాటిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని “మోదీకీ సేనా” అంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా మాట్లాడండి.. హద్దులు మీరకండి.. భవిష్యత్తులో మీ ఉచ్ఛారణ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ ఈసీ ఆదిత్యనాథ్‌ను హెచ్చరించింది. […]

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఈసీ హెచ్చరిక
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 06, 2019 | 12:27 PM

Share

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. హద్దులు దాటుతున్నారు. ఇలా హద్దు దాటిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని “మోదీకీ సేనా” అంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా మాట్లాడండి.. హద్దులు మీరకండి.. భవిష్యత్తులో మీ ఉచ్ఛారణ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ ఈసీ ఆదిత్యనాథ్‌ను హెచ్చరించింది. అంతటితో ఊరుకోకుండా షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

గత ఆదివారం ఘజియాబాద్‌లో కేంద్రమంత్రి వీకే.సింగ్‌ తరపున ప్రచారం చేసిన ఆదిత్యనాథ్‌.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు కురిపించాడు. కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి.. జీ అని గౌరవిస్తే.. మోదీ సేన మాత్రం వారి చేత బుల్లెట్లు తినిపించిందని వ్యాఖ్యానించారు. అయితే పరోక్షంగా భారత సైనిక దళాన్ని “మోదీ సేన”గా ఆయన అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై మండిపడిన విపక్షాలు యోగిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశాయి. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్‌ 5లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ.. ఆదిత్యనాథ్‌ను కోరింది. అయితే ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో.. ఆదిత్యనాథ్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

సైన్యానికి చెందిన కార్యకలాపాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించొద్దని ఇటీవలే ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. అయినా ఆదిత్యనాథ్‌ సైనికుల గురించి వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ మండిపడింది. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డాయి.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్