దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీ వ్యూహాలు తమిళనాడులో పూర్తిగా తలకిందులయ్యాయి. మొత్తం 38 లోక్‌సభ స్థానాలకు గానూ, ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది కమలం పార్టీ. తమిళనాడులో స్థానిక పార్టీ అయిన డీఎంకే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 38 స్థానాల్లో 23 చోట్ల విజయఢంకా మోగించింది స్టాలిన్ టీం. ఇక డీఎంకే మిత్ర పక్షాలు కలిసి ఒక్కసీటు గెలుచుకొని సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్నులోట్టబోయినట్లు అయింది. ఇక్కడ హస్తం పార్టీ హస్తవాసీ కూడా బాగోలేదు. 9 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇక సీపీఐ, సీపీఎం చెరో రెండు స్థానాల్లో ఉనికిని కాపాడుకున్నాయి. కాగా.. వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలతో పాటు కమల్ హాసన్, టీటీవీ దినకరన్ ఏ ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు.