పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..

|

Apr 06, 2021 | 11:00 PM

Tamilnadu Assembly Election 2021: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగింది.. ఉదయం 7గంటల నుంచే మొదలైన ఓట్ల జాతర రాత్రి 7గంటల వరకు కొనసాగింది. పలువురు

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..
Dmk Mp Kanimozhi
Follow us on

Tamilnadu Assembly Election 2021: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగింది.. ఉదయం 7గంటల నుంచే మొదలైన ఓట్ల జాతర రాత్రి 7గంటల వరకు కొనసాగింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి.. పీపీఈ కిట్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడురోజుల కిందట ఆమె కొవిడ్‌ బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే..

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మంగళవారం ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. డీఎంకే 188 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ 25 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. మిగతా సీట్లను కూటమి సభ్యులైన ఇతర చిన్న పార్టీలకు కేటాయించారు. అయితే తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కనిమొళి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. డీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కొవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. వారికోసం ప్రత్యేకంగా టైమ్‌ కేటాయించింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఓటు వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలో దక్షిణ చెన్నైలోని మైలాపోర్ పోలింగ్ కేంద్రంలో కనిమొళి మంగళవారం సాయంత్రం 6-7 గంటల మధ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనిమొళితో పాటు అంబులెన్స్‌లో వచ్చిన ఆమె సహాయకులు, అంబులెన్స్ సిబ్బంది, పోలింగ్ కేంద్రంలో సిబ్బంది, మీడియా ప్రతినిధులు పీపీఈ కిట్లు ధరించారు. ఓటు వేసిన అనంతరం కనిమొళి.. మీడియా ప్రతినిధులకు విజయం సంకేతం చూపెడుతూ తిరిగి అంబులెన్స్‌లోకి చేరుకున్నారు.

Government Apps: ఈ 5 ప్రభుత్వ యాప్‌లు మీ మొబైల్‌లో ఉన్నాయా?.. వీటి ప్రాముఖ్యత ఏంటో తెలిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటారు..

Viral Video: తీయటి కన్నీళ్లకు సాక్ష్యమిదే.. వినికిడి లోపంతో పుట్టిన చిన్నారి.. తొలిసారి అమ్మమాట విని.. వీడియో చూస్తే కన్నీల్లు ఆగవు..

పోలీస్ స్టేషన్‌లో గబ్బర్ సింగ్..! లేడీ పోలీసుతో నాగిన్ డాన్స్..! సోషల్ మీడియాలో రచ్చ..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!