CPI Narayana: 2021 లోనే ఇది పెద్ద జోకు : సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ

|

Jul 09, 2021 | 10:06 PM

టీడీపీ సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును దొంగ అని అనడం 2021 లోనే పెద్ద జోకని సీపీఐ జాతీయ కార్యదర్శి..

CPI Narayana: 2021 లోనే ఇది పెద్ద జోకు : సీపీఐ జాతీయ  కార్యదర్శి కె. నారాయణ
Cpi Narayana
Follow us on

CPI Narayana: టీడీపీ సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును దొంగ అని అనడం 2021 లోనే పెద్ద జోకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు గాని, వ్యక్తిత్వం చూడ్డమన్నది ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి వెల్లంపల్లిలు వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు నారాయణ. కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

విజయనగరం పట్టణంలో అశోక్ గజపతిరాజును కె. నారాయణ ఇవాళ మర్యాద పూర్వకంగా కలిసారు. నైతిక విలువ లేకుండా రాజకీయాలు చేయడం తగదని చెప్పిన నారాయణ, సీఎం జగన్ ఇటువంటి వాటిని నియంత్రణలో పెట్టాలన్నారు. అశోక్ పై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ స్పష్టం చేశారు.

Read also: Jammu and Kashmir: కసరత్తు మొదలైంది : జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ ప్రాసెస్‌ స్పీడప్ చేసిన కేంద్రం