బీహార్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం..!

|

Oct 10, 2020 | 8:16 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. అధికార జేడీ(యూ) బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఈ సారి ఎలాగైనా ఓడించేందుకు ప్రతిపక్షాలు వ్యుహలు పన్నుతున్నాయి.

బీహార్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం..!
Follow us on

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. అధికార జేడీ(యూ) బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఈ సారి ఎలాగైనా ఓడించేందుకు ప్రతిపక్షాలు వ్యుహలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధినాయకత్వాన్ని ఎన్నికల ప్రచారానికి దింపుతోంది. ఇందులో భాగంగా స్టార్ ప్రచారకుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, గులాం నబి ఆజాద్, సచిన్ పైలట్, బాలీవుడ్ నటులు శత్రుఘ్న సిన్హా పేర్లు ఈ జాబితాలో చేర్చింది. మొత్తం 30 మంది ముఖ్య నాయకులు తొలి విడత ఎన్నికలకు ప్రచారం చేయనున్నారు.

బీహార్‌లో ప్రస్తుతం జేడీ(యూ) బీజేపీతో కూడిన ఎన్డీయే, ఆర్జేడీ కాంగ్రెసేతర పార్టీల‌కు చెందిన మహాకూటమి అధికారంలో ఉంది. తాజాగా ఆర్ఎల్ఎస్పీ, ఏఐఎంఐఎం మరో నాలుగు పార్టీలతో మూడో కూటమిని ఏర్పాటు చేసింది. మరోవైపు, తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్డీయే కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దఫాలుగా జరుగనున్నాయి. ఈ నెల 28న జరిగే తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. నవంబర్ 3, 7న రెండు, మూడో దశల పోలింగ్ జరుగుతుంది. అనంతరం నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ రాష్ట్ర బీజేపీ తెలిపింది.