ఒక శాలువా.. ఒక సన్మానం…

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2019 | 9:51 PM

ఆయనంటే ఈయనకి పడదు.. ఈయనొస్తున్నారంటే ఆయన అసలు అటువైపే వెళ్ళరు.. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణం మొదలు పెట్టారు. మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయి, ఒకాయన మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ కారు తన స్టేజ్ లో ఆగకపోతుందా… పాత స్నేహితుడి అండ ఉండకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి హరీశ్ రావు అంటే ఒకప్పుడు పడేది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా జగ్గారెడ్డి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో […]

ఒక శాలువా.. ఒక సన్మానం...
Follow us on

ఆయనంటే ఈయనకి పడదు.. ఈయనొస్తున్నారంటే ఆయన అసలు అటువైపే వెళ్ళరు.. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణం మొదలు పెట్టారు. మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయి, ఒకాయన మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ కారు తన స్టేజ్ లో ఆగకపోతుందా… పాత స్నేహితుడి అండ ఉండకపోతుందా అని ఎదురు చూస్తున్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి హరీశ్ రావు అంటే ఒకప్పుడు పడేది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా జగ్గారెడ్డి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడేవారు. అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు మారారు. హఠాత్తుగా ఓసారి అసెంబ్లీలో హరీశ్ రావును కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 14 ఏళ్ల తర్వాత రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి జగ్గారెడ్డి హరీశ్ రావును అసెంబ్లీలో కలిసి అరగంటపాటు ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అంతటితో ఆగలేదు జగ్గారెడ్డి.. ఆర్ధిక మంత్రి హోదాలో సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశానికి హాజరైన హరీశ్ రావుకు ఘన సన్మానం కూడా చేశారు. హరీశ్ పై ఒకప్పుడు కత్తులు నూరిన జగ్గారెడ్డి ఇంతగా ఎందుకు మారిపోయారు? దీనివెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? జగ్గారెడ్డి ఏ ఎజెండాతో ఒక మెట్టు దిగి హరీశ్ రావు పంచన చేరాడు అని ఆరా తీస్తున్నారు ప్రజలు.

అయితే జగ్గారెడ్డి తన సొంత లాభం కోసం ఇదంతా చేయలేదని, తన ఉమ్మడి జిల్లా మంత్రి కాబట్టి, నియోజకవర్గం అభివ్రుద్ధి కోసమే అతన్ని కలిశానని చెబుతున్నారు. వ్యక్తిగత లాభం కోసమైతే టీఆర్ఎస్ లోనే చేరేవాడినంటున్నారు. అది సరే…హరీశ్, జగ్గారెడ్డిల కలయిక నిలబడుతుందా లేక ఏదైనా తేడా వస్తే మళ్లీ జగ్గారెడ్డి కత్తులు నూరుతారా? అనేది కాలమే తేల్చాలి.