బోటులో ప్రచార యాత్ర ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:51 PM

ప్రయాగరాజ్ : కాంగ్రెస్ పార్టీ నేత‌, ఈస్ట్ యూపీ ఇంచార్జ్ ప్రియాంగా గాంధీ.. మూడు రోజుల గంగా యాత్రను ప్రారంభించారు. దీంతో ఆమె లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారాన్ని మొద‌లు పెట్టారు. ప్రయాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద ఆమె బోటు ఎక్కారు. సుమారు 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ఆమె బోటో ద్వారా ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించనున్నారు. వార‌ణాసిలోని అసి ఘాట్ వ‌ద్ద ప్రియాంకా ప్రచారం ముగియనుంది. యాత్ర ప్రారంభం కంటే ముందుగా ప్రయాగ నగరంలోని హనుమాన్ దేవాలయాన్ని […]

బోటులో ప్రచార యాత్ర ప్రారంభించిన ప్రియాంకా గాంధీ
Follow us on

ప్రయాగరాజ్ : కాంగ్రెస్ పార్టీ నేత‌, ఈస్ట్ యూపీ ఇంచార్జ్ ప్రియాంగా గాంధీ.. మూడు రోజుల గంగా యాత్రను ప్రారంభించారు. దీంతో ఆమె లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారాన్ని మొద‌లు పెట్టారు. ప్రయాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద ఆమె బోటు ఎక్కారు. సుమారు 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ఆమె బోటో ద్వారా ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించనున్నారు. వార‌ణాసిలోని అసి ఘాట్ వ‌ద్ద ప్రియాంకా ప్రచారం ముగియనుంది. యాత్ర ప్రారంభం కంటే ముందుగా ప్రయాగ నగరంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రత్యేక పూజలు చేసి.. బోటుయాత్ర ప్రారంభించారు. ప్రియాంకా గాంధీ ప్రచారంతో యూపీలో కాంగ్రెస్‌కు పున‌ర్ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఈ సంద‌ర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. స‌త్యానికి, స‌మానాత్వానికి ప‌విత్ర గంగా న‌దియే సాక్ష్యమ‌ని, ఈ రాష్ట్ర ప్రజ‌లు గంగా న‌దిపైనే ఆధార‌ప‌డి ఉన్నార‌ని, నేను కూడా గంగా న‌ది ప్రవాహంలో మీతో క‌లిసిపోనున్నట్లు ప్రియాంకా గాంధీ ఓ లేఖ‌లో తెలిపారు.