వైసీపీలో కోల్డ్ వార్.. బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్..?

| Edited By: Pardhasaradhi Peri

Sep 18, 2019 | 2:31 PM

ఏపీ ముఖ్యమంత్రిగా ఇటీవలే వంద రోజులను పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇన్ని రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కనీసం స్పందించనూ లేదు. అటు ట్విట్టర్‌లో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో ఆయన తరఫున మంత్రులు, పార్టీ నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక అందరితో పోలిస్తే ప్రతి అంశంపై ప్రభుత్వం తరఫున మొదటగా మాట్లాడుతూ ‘మీడియా సీఎం’గా బొత్స పేరు తెచ్చుకున్నారు. […]

వైసీపీలో కోల్డ్ వార్.. బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్..?
Follow us on

ఏపీ ముఖ్యమంత్రిగా ఇటీవలే వంద రోజులను పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇన్ని రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కనీసం స్పందించనూ లేదు. అటు ట్విట్టర్‌లో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో ఆయన తరఫున మంత్రులు, పార్టీ నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక అందరితో పోలిస్తే ప్రతి అంశంపై ప్రభుత్వం తరఫున మొదటగా మాట్లాడుతూ ‘మీడియా సీఎం’గా బొత్స పేరు తెచ్చుకున్నారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పట్నుంచి బొత్స సత్యనారాయణ తానే సీఎం హోదాలో మాట్లాడుతున్నారని ఇన్నర్ టాక్.

అమరావతిపై ప్రకటన మొదలుకుని బోటు ప్రమాదం, కోడెల ఆత్మహత్యపై ఇలా అన్ని విషయాలపై జగన్ కంటే ముందే ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి చెప్పాలంటే రాజధాని రచ్చను మొదట ప్రారంభించింది కూడా బొత్స సత్యనారాయణే. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. బొత్స తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదంపై ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఈ రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో బొత్స ప్రవర్తనపై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ కూడా విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానే నేరుగా హెచ్చరిస్తే బాగోదని విజయసాయి రెడ్డి చేత వార్నింగ్ ఇప్పించారట.

వైసీపీలో వైఎస్ జగన్ తరువాతి స్థానం ఎవరిదంటే వెంటనే విజయ సాయి రెడ్డి అని రాజకీయాలు తెలిసిన ఎవరైనా చెప్పేస్తారు. వైసీపీ పార్టీని స్థాపించడం, ఆ తరువాత అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడం, మళ్లీ బయటకు రావడం, పాదయాత్ర చేయడం, సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం.. ఇలా జగన్ ప్రతి విషయంలోనూ విజయ సాయి రెడ్డినే ఆయన వెంటనే ఉన్నారు. అలాంటి ఆయన కూడా ప్రభుత్వం తరఫున అన్ని విషయాల్లో కలగజేసుకోవడం లేదు. కేవలం ట్విట్టర్‌లో మాత్రమే ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు బొత్స చెలరేగిపోతుండటంపై విజయ సాయి ఫైర్ అయ్యారట. ఇకనైనా నోరు తగ్గించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని బొత్సపై విజయ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.