Revanth Reddy: జైపాల్‌ రెడ్డి, జానా రెడ్డి కాదు.. ఇక్కడున్నది రేవంత్‌.. టచ్ చేస్తే మాడి మసై పోతారు..

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా నేను మాటిస్తున్నా.. ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. వచ్చే ఏడాది పంటకు రూ.500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వంద రోజులకే దిగిపొమ్మని కేసీఆర్ అంటున్నారు.. దిగిపోవడానికి తాము అల్లా టప్పాగా అధికారంలోకి రాలేదని.. BRSను తొక్కుకుంటూ అధికారంలోకి వచ్చామన్నారు.

Revanth Reddy: జైపాల్‌ రెడ్డి, జానా రెడ్డి కాదు.. ఇక్కడున్నది రేవంత్‌.. టచ్ చేస్తే మాడి మసై పోతారు..
Revanth Reddy
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:31 PM

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా నేను మాటిస్తున్నా.. ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. వచ్చే ఏడాది పంటకు రూ.500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వంద రోజులకే దిగిపొమ్మని కేసీఆర్ అంటున్నారు.. దిగిపోవడానికి తాము అల్లా టప్పాగా అధికారంలోకి రాలేదని.. BRSను తొక్కుకుంటూ అధికారంలోకి వచ్చామన్నారు. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కేసీఆర్ అంటున్నారు.. 20 మంది టచ్‌లో ఉన్నారని అంటున్నారు.. కాంగ్రెస్ ఎలా ఖాళీ అవుతుందో నేనూ చూస్తా.. అంటూ సవాల్ చేశారు. కేసీఆర్‌ మోదీతో కలిసివస్తారో.. ఎవరితో వస్తారో రావాలి.. అని.. ఇక్కడుంది జైపాల్‌రెడ్డి, జానారెడ్డి కాదు.. రేవంత్‌ అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే.. కాంగ్రెస్‌ని టచ్ చేస్తే మాడి మసైపోతారు.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లో ప్రచారం నిర్వహించారు.

మెదక్‌లో ఇందిరాగాంధీ సెంటిమెంట్‌ను పండించిన రేవంత్ రెడ్డి.. ఇందిర తుదిశ్వాస విడిచింది మెదక్ ఎంపీగానే అంటూ పేర్కొన్నారు. ఆమెను మెదక్ గెలిపించింది కాబట్టే అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీని చూశారు, ఏమైనా అభివృద్ధి చెందిందా.. ఈసారి కాంగ్రెస్‌ని గెలిపించి చూడండి అంటూ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కారు పనైపోయింది, ఇక తుక్కుకింద అమ్మడమేనంటూ రేవంత్ విమర్శించారు.

పదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్‌లో ఉందని.. రెండూ కలిసి మెదక్‌కి చేసింది ఏమైనా ఉందా అంటూ రేవంత్ ప్రశ్నించారు. జెండా, అజెండా మార్చినా రెండూ తోడుదొంగల పార్టీలే అంటూ ఎద్దెవా చేశారు.

మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కి సైతం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్ర నిధులతో దుబ్బాకని అభివృద్ధి చేస్తా అన్నారు.. తాము బస్సులేసుకుని వస్తాం, అభివృద్ధి చూపిస్తావా.. దుబ్బాక నుంచి రంగు మార్చి మెదక్ వచ్చారంటూ రేవంత్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?