ఏపీ అసెంబ్లీ మొదలైన రోజు నుంచీ ప్రతిపక్షం.. విపక్షాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ రోజు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నదుల నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృష్ణా ఆయకట్టు ఎండమావిగా మారుతోందని.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఏపీకి నష్టమని.. దీంతో.. శ్రీశైలం డ్యామ్‌కు నీరు రావడం కష్టమని పేర్కొన్నారు. నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుపోతోందని.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా లాభం లేదని అన్నారు జగన్. అప్పుడు.. తెలంగాణ సర్కార్‌తో సఖ్యత ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు సీఎం జగన్.