అలాంటి కేసీఆర్‌తో కలిసి జగన్ హోదా తెస్తాడా..!

ప్రధాని నరేంద్ర మోదీ అహంకారానికి గుణపాఠం చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రావడం లేదని విమర్శించారు. మోదీ, జగన్ ఇద్దరూ సమాజానికి అత్యంత ప్రమాదకారులని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మిషన్ 150ప్లస్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ఏపీకి హోదా ఇస్తే తమకు ఇవ్వాలని కేసీఆర్ అన్నారని.. అలాంటి కేసీఆర్‌తో కలిసి జగన్ హోదా […]

అలాంటి కేసీఆర్‌తో కలిసి జగన్ హోదా తెస్తాడా..!

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:10 PM

ప్రధాని నరేంద్ర మోదీ అహంకారానికి గుణపాఠం చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రావడం లేదని విమర్శించారు. మోదీ, జగన్ ఇద్దరూ సమాజానికి అత్యంత ప్రమాదకారులని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మిషన్ 150ప్లస్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇక ఏపీకి హోదా ఇస్తే తమకు ఇవ్వాలని కేసీఆర్ అన్నారని.. అలాంటి కేసీఆర్‌తో కలిసి జగన్ హోదా తెస్తాడా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కేసుల కోసం మోదీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీ నటులు జగన్ వద్దకు క్యూ కట్టారని.. హైదరాబాద్‌లో ఆస్తుల కోసమే వైసీపీ కండువాలు కప్పుకున్నారని ఆయన విమర్శించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us