నామినేషన్ దాఖలుకు ‘ముహూర్తం’ చూస్తున్న నేతలు

| Edited By:

Mar 19, 2019 | 1:05 PM

రాజకీయాల్లో ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు కదలరు. ఎన్నికల నేపథ్యంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. ప్రచారం నుండి నామినేషన్ దాఖలు వరకు అన్నీ ముహూర్తబలంతోనే జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ల దాఖలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైనప్పటికీ నేతలు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే మార్చి 19(మంగళవారం), మార్చి 25(సోమవారం) మంచిరోజులు కావడంతో ఆయా రోజుల్లోనే నామినేషన్ […]

నామినేషన్ దాఖలుకు ముహూర్తం చూస్తున్న నేతలు
Follow us on

రాజకీయాల్లో ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు కదలరు. ఎన్నికల నేపథ్యంలో ఈ సెంటిమెంట్ మరీ ఎక్కువ. ప్రచారం నుండి నామినేషన్ దాఖలు వరకు అన్నీ ముహూర్తబలంతోనే జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ల దాఖలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైనప్పటికీ నేతలు అంతగా ఆసక్తి చూపలేదు.

అయితే మార్చి 19(మంగళవారం), మార్చి 25(సోమవారం) మంచిరోజులు కావడంతో ఆయా రోజుల్లోనే నామినేషన్ దాఖలు చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. పండితుల లెక్కల ప్రకారం ఈరోజు మంగళవారం మఖ నక్షత్రం, త్రయోదశి తిథి ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కలసి వస్తుందని పేర్కొంటున్నారు.ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం నామినేషన్లు వేసిన 28 మంది గెలుపొందారన్న విషయం తెలిసిందే. మార్చి 25న సోమవారం విశాఖ నక్షత్రం, పంచమి తిథి రానుండటంతో నామినేషన్ల దాఖలకు అద్భుతమైన ముహూర్తమని పండితులు పేర్కొంటున్నారు. దీంతో నేడు, సోమవారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.