కొడాలి కోటను అవినాష్ బద్ధలు కొట్టగలరా?

|

Mar 23, 2019 | 7:16 AM

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకులు అన్న నందమూరి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ సహజంగానే అందరి దృష్టి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గత 15 ఏళ్లుగా కొడాలి నాని పట్టు సాధించారు. పదేళ్లు టీడీపీ, 5 వైసీపీ పార్టీ తరుపున పాలించారు. తనకంటూ సొంత కేడర్‌ను సాధించుకున్నారు. గుడివాడలో గుడ్లవల్లేరు ప్రాంతంలో టీడీపీకి గట్టి బలం ఉంది. వైసీపీకి నందివాడలో పట్టుుంది. అవినాష్ రాకముందు మూడు […]

కొడాలి కోటను అవినాష్ బద్ధలు కొట్టగలరా?
Follow us on

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకులు అన్న నందమూరి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ సహజంగానే అందరి దృష్టి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గత 15 ఏళ్లుగా కొడాలి నాని పట్టు సాధించారు. పదేళ్లు టీడీపీ, 5 వైసీపీ పార్టీ తరుపున పాలించారు. తనకంటూ సొంత కేడర్‌ను సాధించుకున్నారు. గుడివాడలో గుడ్లవల్లేరు ప్రాంతంలో టీడీపీకి గట్టి బలం ఉంది.

వైసీపీకి నందివాడలో పట్టుుంది. అవినాష్ రాకముందు మూడు గ్రూపులుగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఏకమైంది. రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు తదితర స్థానిక నాయకులు దేవినేని అవినాష్‌కు సహకరిస్తున్నారు. 15 ఏళ్లుగా పట్టున్న గుడివాడను నాని అంత తేలికగా వదులుకుంటారా? అన్నది ఆసక్తిగా ఉంది. కొడాలి కోటను అవినాష్ బద్దలు కొట్టగలరా? రాజకీయ ఓనమాలు నేరుస్తున్న ఈ యువనేతను నాని చిత్తు చేస్తారా? అన్నది గుడివాడ ప్రజలే తేల్చాలి.