టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రాహ్మణ సంఘం మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

|

Mar 06, 2021 | 5:47 PM

మన ప్రజల పట్ల మన సీఎం కెసిఆర్ కు ఉండే ఆర్తి, మోడీ కి, బీజేపీ కి ఉంటుందా? అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. అదే సీఎం కేసీఆర్ చరిత్ర లో బ్రాహ్మణులకు ఎవరూ చేయనంత గా..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రాహ్మణ సంఘం మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Follow us on

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ – హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల టీఆర్‌ఎఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీ దేవి లకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బ్రాహ్మణ సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బ్రాహ్మణులతో, పీవీ నరసింహా రావు కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు.

సీఎం కెసిఆర్ బ్రాహ్మణులను చాలాబాగా గౌరవిస్తారు. అందుకే మీ కోసం చరిత్రలో మిగిలేంతగా ఎంతో చేస్తున్నారు. బ్రాహ్మణులు, వారి నాయకులు ఏనాడూ రాజకీయాలు చేయలేదు. అదే బీజేపీ దేవుళ్ళని, ప్రజల భక్తి సెంటిమెంట్ల ను రాజకీయం చేస్తున్నది. నిజానికి వాజిపేయి లాంటి నేతలు ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోలేదు. మోడీ ప్రభుత్వం, బీజేపీ తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నది. బిజెపి తెలంగాణపై వివక్ష చూపుతుంది. కరోనా, వరదల సమయంలోనూ మనల్ని ఆదుకొలేదు. మతాన్ని వాడుకోవడం, లబ్ధి పొందడం బీజేపీకి అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు.

మన ప్రజల పట్ల మన సీఎం కెసిఆర్ కు ఉండే ఆర్తి, మోడీ కి, బీజేపీ కి ఉంటుందా? అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. అదే సీఎం కేసీఆర్ చరిత్ర లో బ్రాహ్మణులకు ఎవరూ చేయనంత గా చేస్తున్నారు. నేను కూడా మీకు అండగా ఉంటాను. మీరు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఏకం చేయండి. టీఆరెఎస్ కు మద్దతుగా నిలపండి. మన రాష్ట్రం తరహా పథకాలు దేశంలో ఎక్కడా లేవు. యాదాద్రి లాంటి అభివృద్ధిని మనం ఊహించామా? వాస్తవాలు విశ్లేషించండి. విచక్షణతో ఓట్లు వేయండి. వేయించండి. బ్రాహ్మణులు తమ సంఘాల తరపున మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అన్నారు.

ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ బ్రాహ్మణ పక్షపాతి. ఓట్లు, సీట్లకు అతీతంగా మనకు సేవ చేస్తున్న మహానుభావుడు సీఎం కెసిఆర్. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించడం ద్వారా కెసిఆర్ రుణం తీర్చుకోవాలని సతీష్‌ కోరారు.

బ్రాహ్మణ సోదరులకు భీమా, సామూహిక ఉపనయన అవకాశాలు కల్పించాలి. ఈ డిమాండ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు చెప్పి సాధించుకుందాం. ప్రశ్నించే గొంతులు కాదు, పరిష్కరించే గొంతులు, చేతులు కావాలి. ఎవరు ప్రశ్నించారని బ్రాహ్మణ పరిషత్తు, బ్రాహ్మణ సదన్ ఏర్పాటు, విదేశీ విద్య, ధూప దీప నైవేద్యాలు, జీతాల పెంపు వంటివి సీఎం కెసిఅర్ చేశారు?. ఎవరో చెబితే జరిగినవి కావు. బ్రాహ్మణులు, సంఘాలు అడిగితే ఇచ్చినవి కూడా కావు. ఇవన్నీ సీఎం కెసిఆర్ చేసినవేనని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి, రాష్ట్ర అర్చక సమాఖ్య లు ఈ ఎన్నికల్లో టీఆరెఎస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆ సమితి, సమాఖ్య ల నేతలు, స్థానిక నేతలు గంగు ఉపేంద్ర శర్మ, కాకిరాల హరిప్రసాద్, రామచంద్రయ్య శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Read More:

ఆ ఫైలును కేంద్రం తొక్కిపెట్టింది.. అందుకే డీఎస్సీ వేయలేపోయాం -మంత్రి నిరంజన్‌రెడ్డి

దూషణలపై వడ్డీతో సహా సమాధానం.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్వీకి కేటీఆర్ మార్గనిర్దేశం