భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం కు బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన సంజయ్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడి లో సంజయ్ రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. mlcఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన బండి సంజయ్ రామయ్య ను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలరామాలయం అని, తెలంగాణ రాష్ట్రం లో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని భద్రాద్రి రామయ్య ను కోరుకున్నాం అన్నారు.రాష్ట్ర0లో దేవాలయాల మీద వస్తున్న ఆదాయాలు ఎటుపోతున్నాయో,ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదుఅని,ఎవ్వరికీ షెడ్యూల్ ఇవ్వని ముఖ్యమంత్రి వున్నాడు అంటే దేశంలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అనిఅన్నారు.
రాములవారికి శ్రీరామనవమి కి ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకురావడానికి ముఖం చెల్లని ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి తన కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు, రాష్ట్రాన్ని పాలించేది,రాష్ట్రాన్ని దోచుకునేది కేసీఆర్ కుటుంబమే అని, కేంద్రప్రభుత్వం రామాయణ సర్క్యూట్ లో 500 కోట్ల ప్యాకెజిలో 30 కోట్లు భద్రాద్రి అభివృద్ధి ఇస్తామని చెప్పినా DPR ఇవ్వకుండా తప్పించుకుంటున్న ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ పేరు ను DP రావు అని పెడితే కరెక్టు గా సరిపోతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. MLC ఎన్నికల్లో కేసీఆర్ కి DPR ప్రజలే ఇస్తారు అని, కేసీఆర్ కు భద్రాద్రిలో సొంత ఆస్థులుకాని, కబ్జా భూములు గాని లేవు కాబట్టే కేసీఆర్ భద్రాద్రి ని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు.
నిన్న జరిగిన భైంసా ఘటనపై బండి సంజయ్ స్పందిస్తూ, దాదాపు 8 మంది హిందూ యువకులు, పాత్రికేయుల మీద కత్తిపోట్లు, దాడులు జరిగాయి అని, భైంసా తెలంగాణ లో ఉందా, లేక పాకిస్థాన్ లో ఉందా అని ప్రశ్నించారు. ఎం.ఐ.ఎం పార్టీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడు అని ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అని చెపుతూ కేసీఆర్ దర్శకత్వంలో ఎం.ఐ.ఎం పార్టీ ఆదేశాలను పాటిస్తుంది రాష్ట్ర పోలీసు కార్యాలయాలు అని విమర్శించారు. భైంసా లో జరిగిన ఘటన ను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్షమించదు అని బండి సంజయ్ మండి పడ్డారు.
Read More:
రేషన్ డీలర్ల మద్దతు టీఆర్‌ఎస్‌కే… ఒక్కో డీలర్ ద్వారా ఐదు వందల గ్రాడ్యుయేట్ ఓట్లు -మంత్రి గంగుల