ఏపీలో సానుకూల పవనాల కోసం బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్ గీస్తోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంలో గట్టి పొటి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఓటర్లు మనసు గెల్చుకుంటామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా నుంచి, విభజన హామీల అముల దాకా మోదీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికి విశాఖ వైపు చూస్తోంది. ఇందుకు విశాఖ ఎంపీ స్థానాన్ని ఎంచుకుంది. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపతో పొటి చేయించాలని బీజేపీ హైకబమాండ్ భావిస్తొన్నట్లు తెలుస్తోంది. కాగా వెంకయ్య నాయుడు కుమార్తె దీప నిత్యం సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటారు. దీనితో రాజకీయంగా బరిలోకి దిగితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ అధిష్టానం భావిస్తోందన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. కాగా ఇప్పటికే విశాఖ ఎంపీగా ఉన్న హరిబాబు ఈసారి పోటీకి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి వెంకయ్యనాయుడు కుమార్తెను బరిలోకి దింపి బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.