రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వరంగల్‌ వెళ్తుండగా ఘట్కేసర్‌ వద్ద అడ్డగించిన ఎసీపీ భుజంగరావు

|

Feb 01, 2021 | 11:31 AM

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఘట్కేసర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లో బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించడానికి..

రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వరంగల్‌ వెళ్తుండగా ఘట్కేసర్‌ వద్ద అడ్డగించిన ఎసీపీ భుజంగరావు
Follow us on

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఘట్కేసర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లో బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించడానికి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఏసీపీ భుజంగరావు ఘట్కేసర్‌ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హన్మకొండ, పరకాల బీజేపీ కార్యాలయాలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేసి నిప్పంటించారు.

ఓరుగల్లులో శ్రీరాముడి పేరుతో రాజకీయ దుమారం చెలరేగుతుంది. టిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య దాడులు ప్రతి దాడులతో అట్టుడుకుతుంది. తొలుత అయోధ్య శ్రీరాముడి నిధి సమర్పణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో లాఠీ ఛార్జ్ చేసి, పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే చల్లా ఇంటికి వెళ్లి పరామర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్

అనంతరం కర్రలు, రాళ్లతో బీజేపీ కార్యాలయంపై టీఆర్‌స్‌ కార్యకర్తలు, చల్లా ధర్మారెడ్డి అనుచరులు ప్రతిదాడికి పాల్పడ్డారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకంది. బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మా సుబేధారి పోలీస్ స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

 

ఖబడ్దార్ బీజేపీ! మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి ఎర్రబెల్లి..