బెంగాల్ లో స్థానిక బీజేపీ నేతపై కాల్పులు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనంటున్న కమలనాథులు

| Edited By: Anil kumar poka

Mar 08, 2021 | 1:16 PM

పశ్చిమ బెంగాల్ లో స్థానిక బీజేపీ నేతపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి నాడియా జిల్లాల్లో సంజయ్ దాస్ అనే ఈ నేతపై వారు కాల్పులు జరిపి పారిపోయారు.

బెంగాల్ లో స్థానిక బీజేపీ నేతపై కాల్పులు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనంటున్న కమలనాథులు
Follow us on

పశ్చిమ బెంగాల్ లో స్థానిక బీజేపీ నేతపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి నాడియా జిల్లాల్లో సంజయ్ దాస్ అనే ఈ నేతపై వారు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హరింఘట మున్సిపల్ వాగులో  బీజేపీ నేతగా పేరున్న ఇతడిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఎటాక్ చేశారని బీజేపీ వర్గీయులు  ఆరోపిస్తున్నారు. సంజయ్ దాస్ కు ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. దుండగుల కాల్పుల్లో సంజయ్ దాస్ ఛాతీపై గాయమైందని, పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. కాగా బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రచార జోరు క్రమంగా పెరుగుతోంది. ఈ పార్టీల అతిరథ మహారథులు విస్తృత ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నిన్న ప్రధాని మోదీ కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతికర ప్రభుత్వమని, కేంద్రం ఇచ్చిన నిధులను ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ఇక ఈ ర్యాలీకి ముందు బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. పేదల సేవ చేసేందుకు తనకు బీజేపీ అవకాశమిచ్చిందంటూ ఆయన పార్టీని పొగడ్తలతో ముంచెత్తారు.

అదే సమయంలో సిలిగురిలో సీఎం మమతా బెనర్జీ భారీ రోడ్ షో నిర్వహించారు. కేంద్రం వంట గ్యాస్ ధరలను పెంచడం వల్ల ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. అటు- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. తొలి దశలో 30 నియోజకవర్గాలకు ఈ నెల 27న, రెండో దశలో 30 స్థానాలకు ఏప్రిల్ 1న, మూడో దశలో  ఏప్రిల్ 6 న, నాలుగో దశలో 44 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

రాజ్యసభ మొదటిరోజే గందరగోళం.. పెరిగిన ధరలపై ప్రతిపక్షాల ఆందోళన.. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు

భద్రాద్రి రాములవారికి బండి పూజలు.. భైంసా సంఘటనను ఎట్టి పరిస్థితుల్లో క్షమించమన్న సంజయ్‌