ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. తొలుత నేడు కడప జిల్లా పర్యటనకు బయల్దేరిన నిమ్మగడ్డ చివరి నిముషంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు అయ్యింది. కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ బయల్దేరారు.
విజయనగరం మినహా 12 జిల్లాల పరిధిలో తొలి విడతగా 2,723 పంచాయతీలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత పంచాయలీల్లో ఇప్పటికే ప్రచారం ముగిసింది.
Read more:
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ఇంచార్జ్‌లు ఖరారు.. ఏయే జిల్లాకు ఇంచార్జ్ ఎవరో తెలుసా..?
కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత