జగన్‌ని ఏపీ ప్రజలు సిఎంగా చూడాలనుకుంటున్నారు-పీవీపి

విజయవాడ: ప్రతిష్ఠాత్మక విజయవాడ పార్లమెంట్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవ్యాంధ్ర రాజధానిలో కీలకంగా మారిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు విపరీతంగా కృషి చేస్తున్నాయి. ప్రాధాన్యత ఉన్న స్థానం కావడంతో ఈ సీటుపై చంద్రబాబు కూడా ప్రత్యేక ద‌ృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీవీపీ విమర్శలను పెద్దగా లెక్కచేయకుండా.. ప్రచారాన్ని ఉదృతం చేశారు. జిల్లాలో  జగన్ పర్యటన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ […]

జగన్‌ని ఏపీ ప్రజలు సిఎంగా చూడాలనుకుంటున్నారు-పీవీపి

Updated on: Mar 25, 2019 | 12:07 PM

విజయవాడ: ప్రతిష్ఠాత్మక విజయవాడ పార్లమెంట్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవ్యాంధ్ర రాజధానిలో కీలకంగా మారిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు విపరీతంగా కృషి చేస్తున్నాయి. ప్రాధాన్యత ఉన్న స్థానం కావడంతో ఈ సీటుపై చంద్రబాబు కూడా ప్రత్యేక ద‌ృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీవీపీ విమర్శలను పెద్దగా లెక్కచేయకుండా.. ప్రచారాన్ని ఉదృతం చేశారు. జిల్లాలో  జగన్ పర్యటన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సభలకు వస్తున్న జనాలను చూస్తుంటే సిఎంగా ప్రజలు ఎవరిని చూడాలనుకుంటున్నారో అర్థమవుతుందని..ఆడిన మాట తప్పని రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. కుటిల రాజకీయాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారని..విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుందని పీవీపీ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us