ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి.
ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ లేనివాడు గుర్రం ఎక్కినట్టు.. అధికారం చూడని వాళ్లు.. ఒక్కసారిగా.. మంత్రులు అయితే ఇలానే ఉంటుందని.. వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అలాగే.. నా ఇంటివైపు కావాలనే నీటిని పంపి.. ముంచేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లకు నేను అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయడం కావాలి.. అందుకే ఇలా నా ఇంటివైపు నీటిని మళ్లేలా.. ‘ఆర్టిఫియల్ ఫ్లడ్స్’ని క్రియేట్ చేశారని ఆరోపించారు చంద్రబాబు.
ఈ కామెంట్స్‌పై ఏపీ మంత్రులు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అసలే వరదలు పోటెత్తి.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిపనుల్లో తలమునకలై మేముంటే.. చంద్రబాబు నాయుడి ఇల్లు ముంచడం.. ‘ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్’ క్రియేట్ చేయడం తప్ప.. ప్రభుత్వానికి వేరే పనేం లేదా అంటూ.. మంత్రి అవంతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముందు మీ పార్టీలోని వైఫల్యాలను సరిచేసుకోవాలని.. ఆ తర్వాత మాకు నీతులు చెప్పండంటూ.. హితవు పలికారు మంత్రి అవంతి.