తెలంగాణలో ఆర్భాటంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టమేనని టీడీపీ నేత బూర్లగడ్డ వేదవ్యాస్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారని వ్యాఖ్యనించారు. గతంలో కాళేశ్వరంపై జగన్ ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో తాను పార్టీ మారవచ్చని వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు.
కేబినేట్ తీర్మానం లేకుండా ఏపీ భవనాలను తెలంగాణ ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన.. ఎన్నికల్లో ఓటమి, జనసేన ప్రభావంపై చర్చించుకున్నట్లు తెలిపారు. కాకినాడలో కాపు నేతలంతా భేటీ అయిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.