ఈ నెల 22న ఏపీ మంత్రివర్గ విస్తరణ.. వారికే ఛాన్స్‌..!

తమ మంత్రి పదవులకు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ మంత్రి పదవులకు ఈ ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. శ్రావణ మాసం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుండగా.. 22న కొత్త మంత్రుల ప్రమాణ […]

ఈ నెల 22న ఏపీ మంత్రివర్గ విస్తరణ.. వారికే ఛాన్స్‌..!

Edited By:

Updated on: Jul 03, 2020 | 10:50 AM

తమ మంత్రి పదవులకు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ మంత్రి పదవులకు ఈ ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది.

శ్రావణ మాసం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుండగా.. 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరూ బీసీ వర్గానికి చెందినవారు కావడంతో.. కొత్త మంత్రులను కూడా అదే వర్గం నుంచే ఎంపిక చేయాలన్న ఆలోచనలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ కేబినెట్‌లో కొత్తగా రాబోయే మంత్రులు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.