ఆ నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రిమండలి సమావేశం

|

Feb 23, 2021 | 1:35 PM

ఏపీ సీఎం జనగ్‌ అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలు అమలు..

ఆ నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రిమండలి సమావేశం
Follow us on

ఏపీ సీఎం జనగ్‌ అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలు అమలు క్యాలెండర్ కు కేబినెట్ ఆమోద తెలిసింది. రాజధాని అమరావతి పరిధిలో అసంపూర్ణ భవనాల నిర్మాణానికి, ఎన్ఆర్డిఏ కు మూడువేల కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరాఉ చేసే అంశంపై కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈబీసీ నేస్తం పధకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళ లబ్దిదారుకు రూ.45 వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులపై కేబినెట్‌ చర్చించింది.

Read more:

ఏపీ సీఎం జగన్ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా..? ఆ సీక్రెట్ చెప్పేసిన జేసీ దివాకర్ రెడ్డి