కేంద్ర నిధులను బాబు తప్పుదోవ పట్టించారు

గతంలో పోర్టులు నిర్మించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ చంద్రబాబు పనులు చేపట్టలేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

కేంద్ర నిధులను బాబు తప్పుదోవ పట్టించారు

Edited By:

Updated on: Aug 15, 2020 | 7:27 AM

Somu Veerraju on Chandrababu: గతంలో పోర్టులు నిర్మించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ చంద్రబాబు పనులు చేపట్టలేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావు పేటలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్రం మంజూరు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిప్ట్‌ ఆపరేటర్ పోస్ట్‌లను టీడీపీ నేతలు అమ్ముకున్నారని.. కేంద్రం నిధులతో చంద్రబాబు సర్కారు సోకులు చేసిందని అన్నారు.

చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు కూడా నిర్మించకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. పోర్టులు నిర్మించకపోవడం వలనే మత్య్సకారులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగర తీరంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. గతంలో చంద్రన్న బాట పేరిట వేసిన రోడ్లకు బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సోము వీర్రాజు స్పష్టతను ఇచ్చారు.

 

Read More:

ఏపీఎస్‌ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు.. ఈ నెలాఖరున టెండర్లు

హైదరాబాద్‌ను వీడని ముసురు