ఆయన జీవితమంతా బూత్ క్యాప్చరింగ్‌లు, దాడులతోనే గడిచింది: అంబటి

కోడెల 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా బూత్ క్యాప్చరింగ్‌లు, దాడులతోనే గడిచిందని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇనిమెట్లలో కోడెలపై దాడి జరగలేదని.. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తే.. ప్రజలే అడ్డుకున్నారని వివరించారు అంబటి. అయినా.. ఆయనే కావాలని అక్కడ హంగామా సృష్టించారని పేర్కొన్నారు. చేయాల్సిందంతా ఆయన చేసేసి.. మళ్లీ.. వైసీపీ కార్యకర్తలపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజలు తమ ఓట్లన్నీ వాళ్ల పార్టీకే వేయాలన్న ఉద్దేశ్యంతోనే.. ఆయన ఈ విధంగా ప్రవర్తించారని విమర్శించారు అంబటి. […]

ఆయన జీవితమంతా బూత్ క్యాప్చరింగ్‌లు, దాడులతోనే గడిచింది: అంబటి

Edited By:

Updated on: Apr 17, 2019 | 7:20 PM

కోడెల 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా బూత్ క్యాప్చరింగ్‌లు, దాడులతోనే గడిచిందని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇనిమెట్లలో కోడెలపై దాడి జరగలేదని.. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తే.. ప్రజలే అడ్డుకున్నారని వివరించారు అంబటి. అయినా.. ఆయనే కావాలని అక్కడ హంగామా సృష్టించారని పేర్కొన్నారు. చేయాల్సిందంతా ఆయన చేసేసి.. మళ్లీ.. వైసీపీ కార్యకర్తలపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజలు తమ ఓట్లన్నీ వాళ్ల పార్టీకే వేయాలన్న ఉద్దేశ్యంతోనే.. ఆయన ఈ విధంగా ప్రవర్తించారని విమర్శించారు అంబటి. అయినా.. మే 23న కోడెలపై ప్రజాస్వామ్యయుతమైన దాడి జరగబోతోందని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.