Sharad Pawar: ఎన్సీపీలో కోల్డ్ వార్.. మళ్లీ శరద్ పవార్‌కే పగ్గాలు.. అలిగి వెళ్లిపోయిన అజిత్‌..!

| Edited By: Janardhan Veluru

Sep 12, 2022 | 3:08 PM

అజిత్ కంటే ముందుగా జయంత్‌ పాటిల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత అజిత్ పవార్ మాట్లాడాల్సిన సమయంలో ఆయన తన సీటు నుంచి లేచి..

Sharad Pawar: ఎన్సీపీలో కోల్డ్ వార్.. మళ్లీ శరద్ పవార్‌కే పగ్గాలు.. అలిగి వెళ్లిపోయిన అజిత్‌..!
Ajit Pawar And Sharad Pawar
Follow us on

మహారాష్ట్ర రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా సాాగుతున్నాయి. అయితే ఇప్పుడు అధికార పక్షంలో కాదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో కోల్డ్ వార్ మొదలైంది. మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) మనస్తాపానికి గురయ్యారన్న చర్చ జరుగుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ స్థాయి సమావేశం నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్  మధ్యలోనే వెళ్లిపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. పార్టీలో అగ్రనేతగా ఉంటూ కీలక సమావేశంలో మాట్లాడకుండా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణంగా మారింది.  ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశంలో శరద్ పవార్ పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగుతారు. ఈ  సమయంలో అజిత్ కంటే ముందుగా జయంత్‌ పాటిల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత అజిత్ పవార్ మాట్లాడాల్సిన సమయంలో ఆయన తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. దాంతో ఆయనకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో.. ఆయన వెంటనే వస్తారని, వాష్‌రూంకు వెళ్లారని పార్టీ తెలిపాయి.

కానీ, ఈ సమయంలో తన సోదరుడిని ఒప్పించేందుకు పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎంట్రీ ఇచ్చారు. అజిత్‌ను ఒప్పించి వేదిక వద్దకు తీసుకువచ్చే సమయంలో.. శరద్ పవార్ సమావేశ ముగింపు ప్రసంగాన్ని ప్రారంభించారు.

దాంతో ఆయనకు అసలు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. అయితే, అది జాతీయ స్థాయి సమావేశం కావడంతో తాను మాట్లాడకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు అజిత్‌ చెప్పడం ఇప్పుడు ప్రధాన చర్చకు కారణంగా మారింది. వేదికపైనే ఉన్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటిని చూస్తూ ఉండిపోయారు.

 మరిన్ని జాతీయ వార్తల కోసం