సుప్రీంకోర్టు నిర్ణయం వరకు వేచి చేస్తాం.. అభ్యర్థులు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్న అబ్బయ్య చౌదరి

|

Jan 23, 2021 | 12:38 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికలపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి నుంచి వివాదాస్పదంగా మారిన ఎన్నికల ప్రక్రియ..

సుప్రీంకోర్టు నిర్ణయం వరకు వేచి చేస్తాం.. అభ్యర్థులు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్న అబ్బయ్య చౌదరి
Follow us on

ఏపీలో పంచాయితీ ఎన్నికలపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి నుంచి వివాదాస్పదంగా మారిన ఎన్నికల ప్రక్రియ తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరపాలనే పట్టుదలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉండగా.. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం చెబుతోంది.

అయితే ఎన్నికల నిర్వహణపై సంపూర్ణ అధికారాలు ఎస్‌ఈసీవే అంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయం వరకు వేచి చూస్తామన్నారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. అభ్యర్థులు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. కరోనా కాలంలో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల ప్రాణాలకు ఎవరిది భరోసా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది ఉండొద్దనే ఎన్నికలు వాయిదా వేయమన్నామన్నారు.