మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారు… సీఎం కమల్ నాథ్

ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజే మధ్యప్రదేశ్ రాష్ట్రంపై కమలం కన్నేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.. బలనిరూపణకు ఆహ్వానించాలని బీజేపీ గవర్నర్‌కు లేఖరాసింది. అయితే దీనిపై ఆ రాష్ట్ర సీఎం కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులపై ఆశ చూపుతున్నారని ఆరోపించారు. పార్టీ లోక్‌సభ అభ్యర్ధులతో సమావేశానంతరం మాట్లాడుతూ… ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలకు ప్రలోభ పెడుతూ ఫోన్లు […]

మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారు... సీఎం కమల్ నాథ్

Edited By:

Updated on: May 21, 2019 | 8:18 PM

ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజే మధ్యప్రదేశ్ రాష్ట్రంపై కమలం కన్నేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.. బలనిరూపణకు ఆహ్వానించాలని బీజేపీ గవర్నర్‌కు లేఖరాసింది. అయితే దీనిపై ఆ రాష్ట్ర సీఎం కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులపై ఆశ చూపుతున్నారని ఆరోపించారు. పార్టీ లోక్‌సభ అభ్యర్ధులతో సమావేశానంతరం మాట్లాడుతూ… ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలకు ప్రలోభ పెడుతూ ఫోన్లు వచ్చాయని తెలిపారు. అయితే తమ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని.. వారిపై తనకు పూర్తి విశ్వాసముందని అన్నారు. మరోవైపు బీజేపీ కోరినట్లు తాము బలనిరూపణకు సిద్ధమేనని కమల్‌నాథ్ అన్నారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ విపక్ష నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన స్వాగతించారు.