నేడే పోలవరం రివర్స్ టెండరింగ్.. ఆ సంస్థకే టెండర్..?

Polavaram irrigation project, నేడే పోలవరం రివర్స్ టెండరింగ్.. ఆ సంస్థకే టెండర్..?

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు నేడు జరగనుంది. ఈ ప్రక్రియను జలవనరులశాఖ చేపట్టనుంది. స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కోసం 17వందల71కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణం కోసం 3వేల 216 కోట్లు అంచనా విలువ(ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువ)తో రివర్స్ టెండర్లును పిలిచారు. ఆగస్టు 17న నోటిఫికేషన్​ను విడుదల అవ్వగా.. ఈ నెల 20 వరకు బిడ్​లు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. దాదాపు నెలరోజుల పాటు సమయం ఇచ్చినా.. మేఘా ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థ ఒక్కటే బిడ్​ను దాఖలు చేసింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల నిర్మాణాలను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే.

రివర్స్ టెండరింగ్ నిబంధనల ప్రకారం ఐబీఎం విలువ కంటే బిడ్ తక్కువుగా దాఖలైనప్పుడు మాత్రమే ఎల్-1గా ప్రకటించాల్సి ఉంటుంది. బిడ్డర్ ఒక్కరే ఉన్నందున టెండర్లకు సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆ సంస్థకే ప్రభుత్వం టెండర్​ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనులకు రూ. 274 కోట్ల అంచనా విలువతో రివర్స్ టెండర్లు పిలిచిన ప్రభుత్వం..ఈనెల 19న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా…. రూ. 231కోట్లకు ఈ టెండర్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *