Mustard Oil for Weight Loss: మీకు తెలుసా? ఆవాల నూనెతో బరువు కూడా తగ్గొచ్చు..
ఆవాల నూనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి ఆవాల ఆయిల్ గురించి తెలుసు. ఆవాల నూనె ఆయుర్వేదంలో కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఆవాల నూనెతో కేవలం మీ ఆరోగ్యమే కాదు చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడేవారు ఆవాల ఆయిల్ వాడటం చాలా మంచిది. ఇది ఎంతో గాఢమైన వాసన కలిగి ఉంటుంది. దీన్ని ఛాతీపై రాసి మసాజ్ చేస్తే..
Updated on: Mar 14, 2024 | 1:30 PM

ఆవాల నూనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి ఆవాల ఆయిల్ గురించి తెలుసు. ఆవాల నూనె ఆయుర్వేదంలో కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఆవాల నూనెతో కేవలం మీ ఆరోగ్యమే కాదు చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడేవారు ఆవాల ఆయిల్ వాడటం చాలా మంచిది. ఇది ఎంతో గాఢమైన వాసన కలిగి ఉంటుంది. దీన్ని ఛాతీపై రాసి మసాజ్ చేస్తే.. మంచి రిలీఫ్ పొందుతారు. ఛాతీలో పేరుకుపోయిన కఫం కూడా తగ్గుతుంది.

ముక్కు పట్టేసినప్పుడు ఈ ఆయిల్ వాడితే మంచి ఉపశమనం ఉంటుంది. నీటిని బాగా మరగబట్టి.. అందులో కొన్ని చుక్కల ఆవాల ఆయిల్ వేసి ఆవిరి పట్టించాలి. ఇలా చేస్తే ముక్కు దిబ్బడ అనేది తగ్గుతుంది. అలాగే చక్కగా నిద్ర కూడా పడుతుంది.

కొలెస్ట్రాల్ అధికంగా ఉండి బాధ పడేవారు వంటల్లో ఆవాల ఆయిల్ ఉపయోగిస్తే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అదే విధంగా రక్తంలోని కొవ్వు నిల్వలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. అలాగే బరువు కూడా కంట్రోల్ అవుతుంది.

ఈ ఆవాల ఆయిల్ వాడటం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఓమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే గుండెకు రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది.




