1 / 5
నిమ్మకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ సి ఖచ్చితంగా అవసరం అవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇమ్యూనిటీ ఉంటే రోగాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.