Yogasana for Weight Loss: బరువుని తగ్గించి ఈ 5 యోగాసనాలు మిమ్మల్ని స్లిమ్‌గా మార్చేస్తాయి.. ట్రై చేసి చూడండి.

|

Jun 04, 2024 | 9:45 AM

ప్రస్తుతం జీవన శైలిలో మార్పులు వచ్చాయి. కాలంతో పరుగులు పెడుతూ ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడుతున్నారు. ఓ వైపు ఉద్యోగం, మరోవైపు ఇల్లాలుగా భాద్యతలతో మహిళలతో బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో ఊబకాయం, బరువు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి శారీరక ఇబ్బందుల్లో ఒకటి కొవ్వు పెరగడం. ఈ నేపధ్యంలో కొవ్వుని కరిగించడానికి యోగాసనాలు బెస్ట్ ఎంపిక. యోగాసనాలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ యోగాసనాలు శరీర కొవ్వును తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. కొన్ని రకాల యోగాసనాలు శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో కూడా సహాయపడతాయి.

1 / 6
బరువు తగ్గడానికి ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ తప్పనిసరి. రకరకాల వ్యక్తులు తమ సౌకర్యాన్ని బట్టి వ్యాయామం చేస్తారు. కొందరు క్రమం తప్పకుండా నడుస్తారు. కొందరు జాగింగ్ చేస్తారు. చాలా మంది ఇంట్లో ఫ్రీహ్యాండ్ వ్యాయామాలు చేస్తారు. చాలా మందికి యోగా చేయడం కూడా అలవాటు.

2 / 6
బరువు తగ్గడానికి సూర్య నమస్కారం ఉత్తమ యోగాసనం. సూర్య నమస్కారం చేసే సమయంలో మొత్తం శరీర కదులుతుంది. ఈ సూర్య నమస్కారాన్ని చేసే సమయంలో 12 ఆసన భంగిమలను చేయాల్సి ఉంటుంది.

3 / 6
వీరభద్రాసనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. భుజ బలం కూడా పెరుగుతుంది. ఈ ఆసనంలో కేలరీల వినియోగం కూడా అధికంగా ఉంటుంది.

4 / 6
నవసనా లేదా బోట్ పోజ్ యోగాసనం కూడా బొడ్డు కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. పొత్తికడుపు బలాన్ని పెంచుతుంది.

5 / 6
ఉత్కటాసనం లేదా కుర్చీ వంటి యోగాసనం. ఈ ఆసనం చేయడం వల్ల తొడలు, కాళ్ల కండరాలు, వెన్నెముక బలపడతాయి. పాదాలకు బలం చేకూరుతుంది.

6 / 6
సేతు బంధాసనం దిగువ శరీరంలోని కొవ్వును తొలగిస్తుంది. ఈ ఆసనం థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా పరిష్కారమవుతుంది. అంతేకాదు ఈ యోగాసనం ఛాతీ, భుజం కండరాలను కూడా బలపరుస్తుంది.