4 / 5
ఉత్తాన పృష్ఠాసనం: మానసిక ప్రశాంతతలను కలిగించే ఆసనాలలో ఉత్తన పృష్ఠాసనం ప్రముఖమైనది. ఇది మీ ఒత్తిడిని నియంత్రించడంతో పాటు భావోద్వేగాలను అదుపు చేయడం, దృష్టిని మెరుగుపరచడం, సృజనాత్మకతను ఉత్తేజపరచడం వంటి మార్పులకు కారణమవుతుంది. రాత్రి భోజనం తర్వాత కేవలం ఒక్క నిముషం ఈ ఆసనంలో కనుక మీరు గడిపితే చాలు ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు. ఇంకా ఈ ఆసనం మీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించి, శరీర ఫ్లెక్సిబిలిటీని కూడా మెరుగుపరుస్తుంది.