
సీతాకోకచిలుక భంగిమ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యోగాసనం చేసే ప్రక్రియ కూడా చాలా సులభం. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం దిగువ భాగాన్ని టోన్ చేస్తుంది. వెన్నెముకలో వశ్యతను పెంచుతుంది. ఈ యోగాసనం స్త్రీల పునరుత్పత్తి అవయవాలకు ఎంతో మేలు చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. సీతాకోకచిలుక యోగాసనం వలె, బద్ద కోనాసనం కూడా స్త్రీల పునరుత్పత్తి అవయవాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మలసానా ఆసనం వేయడం వల్ల మహిళలకు అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దిగువ పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడంతో పాటు, ఇది సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు UTI సంక్రమణ సమస్య నివారణలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మలబద్ధకం, ఒత్తిడి, పీరియడ్స్ సమయంలో నొప్పి, పొత్తికడుపు వాపు, గ్యాస్ మొదలైన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ మలసానా ఆసనం ప్రయోజనకరంగా ఉంటుంది.

హలాసనం చేయడం వల్ల పొట్ట, వీపు, భుజాలు, కాళ్ల కండరాలకు వశ్యత లభిస్తుంది. ఈ ఆసనం థైరాయిడ్‌తో ఇబ్బంది పడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ ఆసనం మహిళల పునరుత్పత్తి అవయవాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ హలాసనాన్ని రోజూ వేయడం వలన మహిళలు పీరియడ్స్ సమయంలో, మెనోపాజ్ సమయంలో కలిగే సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

సేతుబంధాసనం వేయడం వలన స్త్రీలకు మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాదు.. పీరియడ్స్ క్రాంప్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం వెన్నెముక, నడుము, గ్లూట్స్, చీలమండలను కూడా బలపరుస్తుంది. అంతేకాదు ఈ యోగాసనం గర్భాశయానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్ల అసమతుల్యత సమస్యను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పశ్చిమోత్తాసనం క్రమం తప్పకుండా ఆచరించే మహిళల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది గర్భాశయ కండరాలను సాగదీస్తుంది. దీని కారణంగా మహిళలు గర్భం దాల్చడంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనాల్సిన పని ఉండదు. అంతేకాదు క్రమరహిత పీరియడ్స్ సమస్యను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.