Most Expensive Coffee: ఇదేంది మామ కప్పు కాఫీ అంత రేటా.. తాగాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

Updated on: Nov 05, 2025 | 7:29 PM

కాఫీ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో ప్రత్యేకమైన డ్రింక్.. ఒక్క కప్పు కాఫీ మన మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. మన మూడ్‌ మొత్తాన్ని ఛేంజ్ చేస్తుంది. నవ్వు ఎన్ని టెన్షన్లలో ఉన్న ఒక్క కప్పు కాఫీ వాటిని దూరం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్క కాఫీ అంటే పడి చస్తారు. చాలా మంది కాఫీతోనే డే స్టార్ట్‌ అవుతుంది. సాధారణంగా కాఫీ కప్‌ ధర రూ.10 నుంచి 20 మధ్య ఉంటుంది లేదా 100 ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే కప్పు కాఫీ ధర తెలిస్తే మీ ఫ్యూజులెగిపోతాయి. ఎందుకంటే ఆ కప్పు కాఫీ ధర అక్షరాల రూ.87వేలు. అవును ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ అట. ఇంతకు ఇది ఎందుకు అంత రేటు దీని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

1 / 5
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కాఫీ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? ఇది దుబాయ్‌లోని జూలియట్ అనే బోటిక్ కేఫ్‌లో అందుబాటులో ఉంది. ఇక్కడ ఒక కప్పు కాఫీ ధర 3600 దిర్హామ్‌లు అంటే మన  ఇండియన్ కరెన్సీ రూ. 87,000 రూపాయలు.

2 / 5
ఈ ఖరీదైన కాఫీ పేరు "నిడో 7 గీషా"  ఈ కాఫీ ఇంత ఖరీదైనగా ఉండడానికి కారణం.. రెస్టారెంట్ యాంబియన్సో, లేదా కాపీ కప్పు విలువో కాదు.. కాఫీలో వాడే నక్షత్రం కాఫీ గింజలు. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఈ కాఫీ గింజలను పనామా నుండి దిగుమతి చేసుకుంటారు.

3 / 5
 పనామా నుండి వచ్చిన ప్రీమియం కాఫీ గింజలు అధిక నాణ్యత ప్రమాణాల పరంగా రికార్డు క్రియేట్ చేశాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గింజలుగా పేరుపొందాయి. చాలా పరిమిత పరిమాణంలో లభిస్తాయి. ఈ కాఫీ గింజలను పనామాలోని హసిండా లా ఎస్మెరాల్డా ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు.

4 / 5
ఇథియోపియాలో మూలాలు కలిగిన ఈ కాఫీని 1930లలో కోస్టా రికాకు, తరువాత పనామాకు పరిచయం చేశారు. బారు అగ్నిపర్వతం సమీపంలోని చిక్విరి హైలాండ్స్‌లో 1,800-2,000 మీటర్ల ఎత్తులో తోటలలో ఈ కాఫీ గింజలను పండిస్తారు. ప్రపంచం మొత్తంలో కేవలం 20 కిలోల కాఫీ గింజలు మాత్రమే ఉన్నాయి.

5 / 5
దుబాయ్‌ చెందిన ఈ జూలియట్ కేఫ్ ఈ తోట నుండి ఉత్పత్తైన మొత్తం కాఫీని దాదాపు 2.2 మిలియన్ దిర్హామ్‌లు అంటే రూ. 5.3 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ కాఫీలో జాస్మిన్, సిట్రస్, తేనె, రాతి పండ్ల రుచులను కలిగి ఉంటుంది.