ప్రపంచంలో ఒకటి కంటే అత్యధిక ఖరీదైన వస్తువులు అనేకం ఉన్నాయి. వీటి విలువ తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. లక్షల కోట్ల విలువైన కార్లు లేదా ఇళ్ల, నగలు, విలువైన వస్తువుల గురించి మీరు చూసి ఉంటారు. అయితే కోట్ల విలువైన చెట్టును ఎప్పుడైనా చూసారా? అవును.. అటువంటి చెట్టు ఒకటి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు. దీని పేరు పైన్ బోన్సాయ్ చెట్టు. దీని ధర చాలా ఎక్కువ . ఎంత ఎక్కువ అంటే.. ఒక సామాన్య కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడిపెయ్యగలదు. ధనవంతులైతే మెర్సిడెస్, BMW కార్లను ఏకకాలంలో కొనుగోలు చేస్తారు.
బోన్సాయ్ చెట్లు చాలా విలువైనవి. వీటి పోషణ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది. వీటి ధర కూడా తదనుగుణంగా పెరగడానికి ఇదే కారణం. వైన్ పాత బడే కొలదీ దాని ఖరీదు ఎక్కువ.. అదే విధంగా బోన్సాయ్ చెట్టు కూడా వయసు పెరిగే కొలదీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
బోన్సాయ్ మొక్కల పెంపకం మహా నగరాల్లో ఎక్కువగా వుంటుంది. ఈ బోన్సాయ్ మొక్కల ధర వేల నుంచి లక్షల్లో ఉంటుంది. బోన్సాయ్ మొక్కలను ఎక్కువగా కోటీశ్వరులు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి
అయితే కొన్ని బోన్సాయ్ చెట్టు ఖరీదు కోట్లలో ఉందని మీకు తెలుసా. కొన్నేళ్ల క్రితం జపాన్‌లోని తకమట్సులో జరిగిన అంతర్జాతీయ బోన్సాయ్ సదస్సులో బోన్సాయ్ చెట్టును రూ.9 కోట్లకు పైగా వెచ్చించారు. ఇది ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన చెట్టు. ఇప్పటి వరకు ఏ చెట్టును ఇంత ఎక్కువ ధరకు అమ్మలేదు.
జపాన్‌లోని హిరోషిమాలో 400 ఏళ్ల నాటి బోన్సాయ్ చెట్టు కూడా ఉంది. దీనిని యమకి పైన్ అని పిలుస్తారు. వాస్తవానికి యమకి కుటుంబానికి చెందిన 6 తరాల నుంచి వస్తుంది. తరువాత దీనిని వాషింగ్టన్‌లోని నేషనల్ బోన్సాయ్ , పెన్జింగ్ మ్యూజియమ్‌కు ఈ చెట్టుని విరాళంగా ఇచ్చారు. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే 1945 సంవత్సరంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా బాంబు దాడి నుండి బయటపడింది.
బోన్సాయ్ చెట్లు మాత్రమే కాదు కొన్ని చెట్ల చాలా ఖరీదైనవి. కొన్ని చెట్ల కలపలు కిలో లక్షల రూపాయలకు కూడా అమ్ముతారు. ఈ కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్, దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 7-8 లక్షల రూపాయలు