Viral News: ఏభై ఏళ్ళక్రితం వదిలేసిన చదువు.. 84 ఏళ్ల వయసులో మళ్ళీ మొదలు.. డిగ్రీ పాసై ఔరా అనిపిస్తున్న బామ్మగారు!

|

May 31, 2022 | 9:12 AM

84 ఏళ్ల వృద్ధురాలు తాజాగా గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువుకు వయసు లేదని నిరూపించింది.

1 / 7
ఓ మహిళకు చిన్నతనం నుంచి చదువు అంటే అమితమైన ఇష్టం.. అయితే పేదరికం, కుటుంబ బాధ్యతలు, డబ్బుల ఇబ్బందితో తన చదువుకోలేని కోరికను చంపుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా తన 84వ ఏట డిగ్రీ పట్టాను పుచ్చుకుని అందరికి షాక్ ఇచ్చింది.

2 / 7
USAలోని మిన్నెసోటా నివాసి బెట్టీ శాండిసన్ కు ఇప్పుడు 84 ఏళ్ళు. ఇప్ప్పుడు తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువుకు వయసు లేదని మహిళ నిరూపించింది.

3 / 7
ఒక వ్యక్తి ఏ వయసులో నైనా  నేర్చుకోవచ్చు, ఏదైనా చేయగలదు అని నిరూపించింది. ఎందుకంటే వయసు పెరిగే కొలదీ వ్యక్తికీ జ్ఞాపక శక్తి తగ్గడం.. కంటి చూపు మసకబారడం వంటివి మార్పులు వస్తాయి. అందుకనే ఈ వయసులో డిగ్రీ పట్టాపుచ్చుకోవోడం అంటే సాధారణ విషయం కాదు.

4 / 7
మీడియా నివేదికల ప్రకారం.. శాండిసన్ 67 సంవత్సరాల క్రితం అంటే 1955 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టింది. ఆ సమయంలో తన ఊరిలో యూనివర్శిటీలో చదువుకోవడానికి చేరిన ఏకైక అమ్మాయిగా రికార్డ్ సృష్టించింది  అయితే ఆమె కొన్ని అనుకోని పరిస్థితుల వలన చదువుకు మధ్యలో గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత పెళ్లయి, ఇద్దరు ఆడపిల్లలు జననం.. పిల్లల పెంపకం, కుటుంబాన్ని పోషించడంతో శాండిసన్ కు సమయం గడిచిపోయింది.

5 / 7
ఈ క్రమంలో 1979లో కూతురు కూడా కొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తల్లిగా మరింత బాధ్యతలు  పెరిగాయి. దీంతో కుటుంబ పోషణ కోసం నర్స్ గా ఆస్పత్రిలో అడుగుపెట్టింది. సుమారు 30 సంవత్సరాలు నర్సుగా పనిచేసింది. తన డిగ్రీ గురించి మరచిపోయింది.

6 / 7
అయితే తన ఉద్యోగానికి పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాల తర్వాత తన అసంపూర్తి డిగ్రీ గుర్తుకు చేసుకుంది. దీంతో డిగ్రీని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

7 / 7
దీంతో తన తల్లిని కూతురు 2018లో చదువుని మళ్ళీ ప్రారంభించమని సూచించింది. దీంతో ఇప్పుడు శాండిసన్ తన 84 ఏళ్ల వయసులో ఈ ఏడాది మే 7న డిగ్రీ పూర్తిచేసింది. ఆమె ఆనందానికి అవధులు లేవు.  చదువు కోసం శాండిసన్ తన స్ఫూర్తి మరింత మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.