UNESCO World Heritage Sites: ప్రకృతి అందాలతో కూడిన టాప్ 5 సహజ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే..

Updated on: Jul 16, 2025 | 3:11 PM

ప్రకృతిని ఇష్టపడని వ్యక్తి ఈ విశ్వంలోనే ఉండరు. చాలామందికి ప్రకృతి పర్యటనలు చేయడానికి ఇష్టపడతారు. భూమిపై చాలా ప్రదేశాలు ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్నాయి. ఎత్తైన పర్వతాల నుండి పచ్చని వర్షారణ్యాల వరకు భూమిపై మంత్రముగ్దులను చేసే  ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించే 5 సహజ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గురించి ఈరోజు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం రండి.. 

1 / 5
గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా: ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ 2300 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది వేలాది సముద్ర జీవ జాతులతో కూడిన నీటి అడుగున స్వర్గం. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. 

2 / 5
 గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్, USA: ఈ భారీ కేనియన్ కొలరాడో నదిచే చెక్కబడినట్లు ప్రకృతి అద్భుతంలా కనిపిస్తుంది. సుదీర్ఘ భౌగోళిక చరిత్రను కలిగి ఉన్న ప్రదేశం ఇది. దాని రాతి కొండలలోని పొరలు మిలియన్ల సంవత్సరాల నాటివి.

3 / 5
గాలాపాగోస్ దీవులు, ఈక్వెడార్: ఈ దీవులలోనే డార్విన్ తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇతర దీవులలో అస్సలు కనిపించని ప్రత్యేక జాతులకు అవి నిలయంగా ఉన్నాయి. మీరు ఇక్కడ చాలా అరుదైన జీవులను చూడవచ్చు. 

4 / 5
ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్, క్రొయేషియా: వరుసగా జలపాతంలా కదులుతున్న సరస్సులు, నడవడానికి చెక్క వంతెనలతో కూడిన ఆదర్శవంతమైన పార్క్. అడవి మధ్యలో  నీలం రంగు నీరు కూడిన సరస్సులు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. 

5 / 5
హా లాంగ్ బే, వియత్నాం: ఇది స్ఫటిక జలాలను చీల్చుకొని వచ్చిన వేలకొద్దీ సున్నపురాయి ద్వీపాలతో కూడిన మంత్రముగ్దులను చేసి సముద్ర వాతావరణం. ఈ ప్రదేశం చెట్టు అనేక  పురాణగాథలు అల్లుకొని ఉన్నాయి. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 