ఈ దేశాలలో మన రూపాయి విలువ ఎక్కువే.. తక్కువ డబ్బుతో ఎక్కువగా రోజులు ఎంజాయ్ చెయ్యొచ్చు.. ఎక్కడంటే..

| Edited By: Rajitha Chanti

Jul 10, 2021 | 2:17 PM

మన భారతీయ రూపాయి మారకం విలువ ఇతర దేశాలలో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. డాలర్ కంటే రూపాయి విలువ తక్కువే. కానీ కొన్ని దేశాలలో మన రూపాయి విలువ ఎక్కువే. ఫలితంగా అక్కడి ప్రాంతాలను తక్కువ డబ్బుతో ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయ్యోచ్చు.

1 / 7
 ఇండోనేషియాలో భారత కరెన్సీ విలువ ఎక్కువ. దీంతో ఇక్కడ వీసా ఫ్రీ ఎంట్రీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇండోనేషియాలో బాలి అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం.  భారతీయ ఒక్క రూపాయి విలువ-194.25 ఇండోనేషియా రూపాయి.

2 / 7
 వియత్నాం.. ఇక్కడ కూడా భారతీయ కరెన్సీ విలువ ఎక్కువే. ఇక్కడి సాంప్రదాయ వంటకాలు, సంస్కృతి, నదులతో కూడిన అందమైన ప్రదేశాలు అనేకం. యుద్ద మ్యూజియం, ఫ్రెంచ్ వలసరాజ్యాల నిర్మాణం వంటివి ప్రసిద్ధి. ఒక్క భారతీయ రూపాయి విలువ -308.22 వియత్నామీస్ డాంగ్.

3 / 7
కంబోడియా- అంగ్కోర్ వాట్ ఆలయం ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లడానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. రాయల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం, చారిత్రిక ప్రదేశాలు అనేకం. పాశ్చాత్య దేసాల కంటే కంబోడియాలోకి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. ఒక్క భారతీయ రూపాయి విలువ -51.47 కంబోడియన్ రీల్.

4 / 7
శ్రీలంక.. ఇక్కడ బీచ్‏లు, పర్వతాలు, పచ్చని ప్రకృతి, చారిత్రక భవనాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఒక్క భారతీయ రూపాయి విలువ-2.67 శ్రీలంక రూపాయి.

5 / 7
నేపాల్.. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్‏తోపాటు.. ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి. భారతీయులకు ఇక్కడి వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఒక్క భారతీయ రూపాయి - 1.60 నేపాలీ రూపాయి.

6 / 7
ఐస్లాండ్- ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ నీలి మడుగులు, జలపాతాలు, హిమానీనదాలు, నార్తర్న్ లైట్స్‏కు ప్రసిద్ధి. ఒక్క భారతీయ రూపాయి విలువ - 1.65 ఐస్లాండిక్ క్రోనా.

7 / 7
హంగరీ.. ఇది నిర్మాణం.. సంస్కృతికి ప్రసిద్ధి. ఇది రోమన్, టర్కిష్, ఇతర సంస్కృతులచే ప్రభావితమైంది. హంగరీ రాజధాని బుడా పెస్ట్ ప్రపంచంలోని అత్యంత ఎక్కువగా మంది పర్యాటకులు వచ్చే ప్రదేశం. ఒక్క భారతీయ రూపాయి విలువ- 4.01 హంగేరియన్ ఫోరింట్.