గిన్నిస్ వరల్డ్ రికార్స్డ్ ప్రకారం.. రోజర్స్-పేజ్ తమ కారుతో 116 దేశాలను సందర్శించారు. 1999 జనవరి 1న ఐస్‌లాండ్‌లో తన హార్డ్ టాప్ కన్వర్టిబుల్ కారుతో ప్రారంభమైంది.
వివిధ దేశాల్లోని ప్రజల జీవనశైలి గురించి కొంతవరకైనా తెలుసుకోవాలనుకున్న వీరి ప్రయాణం 2002, జవవరి 5 వరకు కొనసాగింది. ఈ క్రమంలో వారు మొత్తం 6 ఖండాలను చుట్టి వచ్చారని గిన్నిస్ వరల్డ్ రికార్స్డ్ పేర్కొంది.
తన పర్యటన గురించి జేమ్స్ మాట్లాడుతూ ‘రికార్డుల్లో నిలచేందుకు పర్యటన మొదలు పెట్టలేదు. ప్రపంచాన్ని పర్యటించాలని అనుకున్నాను’ అన్నాడు.
ఇక ఈ జంట ప్రమాదకరమైన పర్వత రహదారుల గుండా యుద్ధాలు జరిగిన ప్రాంతాలను కూడా సందర్శించారు. ఈ క్రమంలో తాము విభిన్న నేపథ్యం కలిగిన వారిని కలిశామని, అంటువ్యాధుల బారిన పడ్డామని, వివిధ రకాల ఆహారాలను రుచి చూశామని పేర్కొన్నారు.
దాదాపు 2,45,000 కిలోమీటర్ల మేర సాగిన తమ ప్రపంచ పర్యటనలో ఎంత ఖర్చు చేశామో తెలియదని రోజర్స్-పేజ్ జంట తెలిపింది. కానీ ఈ పర్యటన తమ జీవితంలోకి ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేమని.. తమ పర్యటనను ఇంకా కొనసాగిస్తూనే ఉంటామని తెలపారు.