
ఇటలీలోని వెనిస్: కాలువల నగరం అని పిలువబడే వెనిస్, కళ, వాస్తుకళ, రొమాన్స్‌ల అద్భుతమైన మిశ్రమం. గొండోలా ప్రయాణాలు, సెయింట్ మార్క్స్ బసిలికా, చారిత్రక వీధులు వెనిస్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. మీ లైఫ్ పార్టనర్‌తో హనీమూన్ కోసం ఇది మంచి ఎంపిక.

ఆమెరికాలోని గ్రాండ్ కెన్యన్ : గ్రాండ్ కెన్యన్ కొలరాడో నదిచే చెక్కబడిన భౌగోళిక అద్భుతం. ఈ నగరం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. రిమ్ వెంట నడవడం, హెలికాప్టర్ పర్యటన చేయడం ద్వారా ఈ అద్భుత నగరం దృశ్యాలను ఆస్వాదించవచ్చు. హనీమూన్ కోసం ది బెస్ట్.

జపాన్‌లోని క్యోటో: చరిత్ర, సంస్కృతితో నిండి ఉన్న క్యోటో, పురాతన సంప్రదాయాలను ఆధునిక అందంతో కలుపుతుంది. శతాబ్దాల నాటి ఆలయాలు, బాంబూ గ్రోవ్‌లు. గైషా ప్రదర్శనలు ఈ నగరాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇక్కడ మీ హనీమూన్ సరదాగా సాగుతుంది. ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలి.

అర్జెంటీనా, చిలీలను కలిపే పటగోనియా: ఎత్తైన శిఖరాలు, హిమానీనదాలు, సరస్సులతో నిండి ఉన్న పటగోనియా అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ సమయాన్ని గడపవచ్చు. అలాగే ఫోటోషూట్ కోసం బెస్ట్ ఆప్షన్.

గ్రీస్‌లోని సాంటోరిని: నీలి గోపురం ఆలయాలు, తెల్లగా కడిగిన భవనాలతో సాంటోరిని రొమాన్స్, అందం సమ్మేళనం. ఇది పెళ్ళైన తర్వాత హనీమూన్ కోసం మంచి ఎంపిక. మీ జీవిత భాగస్వామితో సరదగా గడపవచ్చు.