అజంతా, ఎల్లోరా గుహలు: మహారాష్ట్రలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందినవని పురావస్తు నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒకే కొండ రాయి నుంచి తొలచిన ఈ గుహలు.. దేవాలయాలు, మఠాలతో నిండి ఉంటాయి. ఈ గుహలు బౌద్ధ, హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించే విస్తృతమైన చేతి పెయింటింగ్‌లు, శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో అంజతా, ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి.