World Biryani Day: బిర్యానీ ప్రియులా.. మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్టీ టేస్టీ వెజ్, నాన్ వెజ్ 5 రకాల బిర్యానీలు..

|

Jul 02, 2023 | 10:03 AM

భారతీయులు భోజన ప్రియులు. అల్పాహారం, భోజనం, స్నాక్స్ ఇలా ఏ సమయంలో తినే ఆహారంఅయినా సరే రకరకాల ఆహార పదార్ధాలు ఉండాల్సిందే. అయితే బిర్యానీ మాత్రం అత్యధిక ప్రజలు ఇష్టపడే ఆహారంగా ప్రపంచ ఖ్యాతిగాంచింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారాన్ని బిర్యానీ డేగా ఆహార ప్రియులు జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని భోజన ప్రియులు తమ ఇష్టమైన బిర్యానీతో జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. రకరకాల కూరగాయలతో చేసే బిర్యానీ అయినా, చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ బిర్యానీ అయినా సరే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే అంటూ బిర్యానీ ప్రేమికులు. ఈ రోజు టేస్టీ టేస్టీ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీల గురించి తెలుసుకుందాం.. 

1 / 5
వెజిటబుల్ బిర్యానీ: వాస్తవానికి బిర్యానీ అంటే నాన్ వెజ్ అయితేనే బాగుంటుంది అని అంటారు. మరి శాఖాహారులు బిర్యానీ తినాలనిపిస్తే .. డిఫరెంట్ కూరగాయలతో బిర్యానీని తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని మరింత రుచిని తీసుకుని వచ్చెనందుకు జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగిస్తే మంచి రుచిని సొంతం చేసుకుంది. 

2 / 5
పనస కాయ బిర్యానీ: వెజ్ ప్రియులు కూడా బిర్యానీని భిన్నమైన టెస్ట్ తో ఆస్వాదించవచ్చు.. కూరగాయలతో మాత్రమే కాదు..బిర్యానీని ఇష్టపడే శాకాహారులకు పనస పండు బిర్యానీ బెస్ట్ ఎంపిక. ఈ బిర్యానీని వెజ్, నాన్ వెజ్ వారు ఇద్దరూ ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ తయారీలో పనస కాయ, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుంకుమ పువ్వు, జీడిపప్పు, పెరుగు వంటి వాటిని ఉపయోగిస్తారు. 

3 / 5
హైదరాబాదీ బిర్యానీ: బిర్యానీ అంటే అందరి మదిలో మెదిలేది హైదరాబాద్ బిర్యానీ. దమ్ బిర్యానీగా కూడా పిలుస్తారు దీనిని. నిజాం వారసత్వంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది హైదరాబాద్ బిర్యానీ. అత్యంత ప్రజాదాహరణ పొందిన ఆహార వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ ఒకటి. నాణ్యమైన బాస్మతి బియ్యం, చికెన్‌, కుండ దీనిని తయారుచేస్తారు.  

4 / 5
మటన్ మండి బిర్యానీ: మాంసాహారులు కూడా అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాన్ని తినరు. ముఖ్యంగా మటన్ ను ఇష్టంగా తినేవారు చికెన్ తినడానికి అంత ఆసక్తిని చూపించారు. అటువంటి వారికీ మటన్ బిర్యానీ బెస్ట్ ఎంపిక. ఇది అదనపు రుచితో బాగుంటుందని అంటారు మటన్ తినడానికి ఇష్టపడేవారు. 

5 / 5
మలబార్ ఫిష్ బిర్యానీ: నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ వంటి బిర్యానీలను మాత్రమే కాదు.. కొంచెం ప్రయత్నిస్తే సీఫుడ్ అయిన చేపలు, రొయ్యలు, వంటి వాటితో కూడా డిఫరెంట్ టెస్ట్ లతో బిర్యానీలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తినేవారు ప్రసిద్ధి చెందిన మలబార్ ఫిష్ బిర్యానీ బెస్ట్ ఎంపిక. ముఖ్యంగా సౌత్ ఇండియాలో మలబార్ ఫిష్ బిర్యానీ ఫేమస్.